Saturday, December 14, 2024
HomeUncategorizedచెరువుల్లో కూల్చిన అక్రమ నిర్మాణ వ్యర్థాల  తరలింపు కు టెండర్ల ఆహ్వానించిన  హైడ్రా.

చెరువుల్లో కూల్చిన అక్రమ నిర్మాణ వ్యర్థాల  తరలింపు కు టెండర్ల ఆహ్వానించిన  హైడ్రా.

చెరువుల్లో కూల్చిన అక్రమ నిర్మాణాల వ్యర్థాలను, వాటిని తరలించేందుకు టెండర్లను ఆహ్వానించిన హైడ్రా.

20 మీటర్ల ఎత్తైన నిర్మాణాలను సైతం కూల్చేలా మిషనరీ ఉండాలంటూ టెండర్లలో సూచించిన అధికారులు.

జా కట్టర్, షేర్ కట్టర్, అడిషనల్ షేర్ కట్టర్, రాక్ కట్టర్ విత్ బ్లేడ్ ఉండే యంత్రాలు సమకూర్చాలని టెండర్లు ఆహ్వానించిన హైడ్రా.

హైడ్రా కు చెందిన లాజిస్టిక్ సపోర్టివ్ వింగ్ ద్వారా టెండర్లను ఆహ్వానించిన హైడ్రా అధికారులు.

నేటి నుండి ప్రారంభమయ్యే టెండర్లలో ఈనెల 27 వరకు బిడర్లు టెండర్లు దాఖలు చేయవచ్చు.

ఈఎండి 10,000 రూపాయలు చెల్లించి టెండర్లలో పాల్గొనవచ్చు.

టెండర్లలో పాల్గొనే వాళ్లు గతంలో ఒక నిర్మాణమైన కూల్చిన అనుభవం ఉండాలి.

మిషనరీ అంతా కూడా ఓ ఆర్ ఆర్ లోపలి భాగంలో ఉండడంతో పాటు నాలుగు గంటల్లో సైట్కు చేరుకునే విధంగా ఉండాలి.

Previous article
Next article
యూట్యూబ్ చానల్స్ అక్రిడిటేషన్లు అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం.

‘’యూట్యూబ్ ఛానల్స్ – అక్రెడిటేషన్లు  ‘’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం.

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి విధివిధానాలు, అనుసరించాల్సిన నియమ నిబంధనలు సూచించడానికి , యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు, తదితర అంశాలపై చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్,  కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

‘’యూట్యూబ్ ఛానల్స్- అక్రెడిటేషన్లు ’’ అంశంపై మీడియా అకాడమీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సెప్టెంబర్ 23న, బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో నిర్వహిస్తుంది. ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, నీష్ణాతులు ఈ సమావేశంలో పాల్గొని సంబంధిత విషయాలపై చర్చించి, జర్నలిస్టులకు  అక్రెడిటేషన్లు ఇవ్వడానికి సూచనలు చేస్తారని అకాడమీ  చైర్మన్ చెప్పారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments