గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
కుమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థినులను వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో బెడ్లు సరిపోకపోవడంతో ఒక్కోదానిపై ఇద్దరికి వైద్యసేవలు అందించారు. అస్వస్థతకు గల కారణాలు తెలియరాలేదు…