*తెలంగాణకు చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని, వచ్చే సారి రాష్ట్రానికి బీసీ వ్యక్తే సీఎం అవుతారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.* 2028 ఎన్నికల్లో బీసీ బిడ్డనే తెలంగాణ ముఖ్యంత్రి అవుతారని జోస్యం చెప్పారు. *ప్రస్తుత రేవంత్ రెడ్డి కేబినెట్లో మిగిలిన ఆరు మంత్రి పదవులు కూడా బీసీలకేనని* పేర్కొన్నారు. *గతంలో లాగా ఇప్పుడు బీసీలు లేరని.. మాలో చైతన్యం వచ్చిందన్నారు. కులాలు వేరు అయినా మేమంతా బీసీలమేనని* మోటివేషనల్ కామెంట్స్ చేశారు. *నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లోని ఓ హోటల్లో బీసీ డిమాండ్స్‌పై అల్ పార్టీ క్యాస్ట్ అసోసియేషన్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.* ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాజకీయాలు, ఉద్యోగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని.. లెక్క ప్రకారం దక్కాల్సిన ఫలాలు బీసీలకు అందడం లేదన్నారు. *కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో పాటు బీసీ డిక్లరేషన్‌లోని హామీలు అమలు బాధ్యత నేను తీసుకుంటానని* స్పష్టం చేశారు. *రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ అగ్ర కులాల వ్యక్తులకే దక్కుతున్నాయని.. బీసీలలో కాంట్రాక్టర్లే లేరా* అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో బీసీలపై 3 లక్షల ముప్పై ఏడు కోట్ల రూపాయల అప్పు ఉందని.. అసలు ఈ అప్పు ఎందుకు చేశారో కూడా తెలియదన్నారు. గత పాలకుల కారణంగానే ఈ అప్పు అయ్యిందంటున్నారు.. అసలు దీనికి బాధ్యులు ఎవరని క్వశ్చన్ చేశారు.