` తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార. పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఫుట్ బాల్ మ్యాచ్ ముగింపు వేడుకలకు సోమవారం నాడు మంత్రిగారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
తెలంగాణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఇప్పటికే ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు స్పోర్ట్స్ యూనివర్సిటీలో అన్ని రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు రకాల క్రీడల్లో గొప్ప గొప్ప క్రీడాకారులను అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.