ఒడిశా లోని పూరీ శ్రీ క్షేత్రంలో రహస్య గదులు ఉన్నాయా..? అన్న దానిపై శనివారం శోధన ప్రారంభమైంది..
హైదరాబాద్ కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్టీఆర్ఐ), పురావస్తు శాఖ (ఏఎస్ఐ) కు చెందిన 22 మంది నిపుణులు రాడార్లతో సర్వే చేశారు.
“ఆది, సోమవారాల్లో కూడా ఈ అధ్యయనం జరుగుతుంది.
ఈ పనులన్నీ శాస్త్రీయ పద్ధతిలో పూర్తి చేయడానికి పది రోజులు పడుతుంది” అని ఎన్టీఆర్ఐ నిపుణుడు ఆచార్య ఆనంద కుమార్ పాండే తెలిపారు..