*ప్యూరిఫైడ్ వాటర్తో మెగ్నీషియం లోపం?*
మెగ్నీషియం మన నరాల వ్యవస్థ పనితీరుకు, డయాబెటిస్, ఇస్కీమిక్ స్ట్రోక్ నివారణకు అత్యవసరం. ప్రకృతిసిద్ధంగా లభించే నీటిలో 10-20 శాతం మేర మెగ్నీషియం ఉంటుంది. కానీ నేడు వాడుతున్న ప్యూరిఫైడ్ లేదా మినరల్ వాటర్లో అన్ని మినరలను తొలగిస్తున్నారని ఇజ్రాయెల్ పరిశోధకులు తెలిపారు. దీంతో నీటి ద్వారా లభించాల్సిన మెగ్నీషియం మనకు అందడం లేదని, మినరల్ వాటర్ మృతజలాలతో సమానమని తాజా నివేదికలో హెచ్చరించారు.