
*ప్రతి గంటకు ప్రయాగ్ రాజ్ కు 1,000
వాహనాలు..!*
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని జరుగుతున్న మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు.. ఈ క్రమంలో ప్రయాగ్ రాజ్ సరిహద్దులో ఉన్న మధ్య ప్రదేశ్ లోని రేవాలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి గంటకు దాదాపు 1,000 వాహనాలు ప్రయాగ్ రాజ్ వైపు కదులుతున్నాయని, అదే సమయంలో దాదాపు 800 వాహనాలు అక్కడి నుంచి తిరిగి వస్తున్నాయని అధికారులు తెలిపారు. భారీ ట్రాఫిక్ కారణంగా సరిహద్దు ప్రాంతంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా అప్రమత్తంగా ఉండాలన్నారు..