Sunday, December 8, 2024
HomeUncategorizedప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు క్షేత్ర విశిష్టతను భంగం కలవకూడదు . మంత్రి  కొండా...

ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు క్షేత్ర విశిష్టతను భంగం కలవకూడదు . మంత్రి  కొండా సురేఖ.

హైదరాబాద్ సెప్టెంబర్18:- ( సమయం న్యూస్)
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా, చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని అటవీ,పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని ప్రముఖ దైవ క్షేత్రాలైన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ప్రగతి, వైటిడిఎ ఆధ్వర్యంలో యాదాద్రి దేవాలయ పురోగతికి చేపడుతున్న కార్యక్రమాలు, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, పలు దేవాలయాల్లో సౌకర్యాల కల్పనపై సెక్రటేరియట్ లోని దేవాదాయ ధర్మదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి కొండా సురేఖ దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.   

దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్ రావు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకన్న గౌడ్, డిఈఈ ఐశ్వర్య, వైటిడిఎ ఎస్టేట్ ఆఫీసర్ సంతోష్, కంచి కామకోటి వేదపాఠశాల ఛైర్మన్ గోవింద హరి, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, దేవాలయాల ప్రగతికి చేపట్టే పనులు అటవీ, దేవాదాయ, పర్యాటక, సాంస్కృతిక, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ తదితర శాఖల సమన్వయంతో ఎలాంటి ఆటంకాలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటి నివేదిక సమర్పించిన తర్వాత యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురం స్వర్ణతాపడం, వేదపాఠశాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు  తెలిపారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో గోవింద హరి ఛైర్మన్ గా రాయగిరిలో 20 ఎకరాల్లో 43 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వేదపాఠశాలను నిర్మించనుట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. సిద్ధమైన అన్నదాన సత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంతి సురేఖ తెలిపారు.

*యాదగిరి గుట్ట వద్ద ఇండియాలోనే అతి పొడవైన లింక్ బ్రిడ్జ్ నిర్మాణం*
యాదాద్రి దేవస్థానానికి రాకపోకల నిమిత్తం ఎగ్జిట్ ఫ్లై ఓవర్ పైనే ఆధారపడిన భక్తులకు నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జ్ (ఎంట్రీ ఫ్లై ఓవర్) గొప్ప ఉపశమనం లభించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. మెకల్లై(mecalloy) స్టీల్ తో నిర్మించనున్న 64 మీటర్ల ఈ ఫ్లై ఓవర్ ఇండియాలోనే రెండవ అతి పొడవైన బ్రిడ్జ్ కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చి పెడుతుందని మంత్రి అన్నారు. 3 నెలల్లో ఈ లింకింగ్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టేలా మంత్రి సురేఖ దిశా నిర్దేశం చేశారు. 


కచ్చితమైన ప్రణాళికతో కీసరగుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి గారి  సూచనల ప్రకారం రామప్ప దేవాలయం స్ఫూర్తితో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం, నాట్యమండపం, పరిసరాలను తీర్చిదిద్దాలని సూచించారు. దేవాలయం చుట్టూ ఉన్న లక్ష్మీనరసింహా, ఆంజనేయ, నాగదేవతల ఆలయాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి అభివృద్ధి పనులతో సంబంధమున్న ఆయా శాఖలకు పంపి ఆమోదం తీసుకోవాలన్నారు. శ్రావణమాసం, కార్తీక మాసాల్లో విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నందున భక్తుల తాకిడిని తట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దేవాలయ ప్రాశస్త్యాన్ని వివరించే పుస్తకాల ముద్రణతో పాటు వెబ్సైట్ ను ఆధునీకరించాలని సూచించారు. దీర్ఘకాల మనగిలిగేలా, భక్తులు, పర్యాటకులను ఆకట్టుకునేలా పర్యావరణహిత విధానాలను అనుసరిస్తూ పటిష్టంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. శ్రీరాముడు ప్రతిష్టించినట్లుగా చెప్పబడుతున్న కీసరగుట్ట దేవాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని సూచించారు. కులవృత్తులు, మహిళాసంఘాల సభ్యులకు దేవాదాయ శాఖ తరఫున ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. చేర్యాల నకాషీ చిత్రకళ, పోచంపల్లి చేనేత, పట్టు వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేసే దిశగా కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. సవరణలతో కూడిన మాస్టర్ ప్లాన్ పై సమీక్ష అనంతరం సీఎం గారికి సమర్పించి వెంటనే పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

గోదావరి నదీ తీరంలోనే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కొలువై ఉన్నందున నదికి వరదలు వస్తే ఆ ముంపు ప్రభావం లేకుండా పలు దశల్లో చేపట్టిన పనుల వివరాలను కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి వివరించారు. ఈ దిశగానే అభివృద్ధి పనులు చేపట్టాల్సిందిగా మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలు, మహాపుష్కరాల సమయంలో లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని అభివృధ్ది పనులు చేపట్టాల్సిందిగా సూచించారు. యాదగిరి గుట్టతో పాటు భద్రాచలంలోనూ పూజా కార్యక్రమాలకు పూలు, తులసి వంటి పవిత్ర పత్రాలను బయటి నుంచి కొనకుండా దేవాలయ భూముల్లోనే వాటి పెంపకం చేపట్టేలా ఉద్యానవన శాఖ సహకారం తీసుకోవాలన్నారు. దేవాలయ అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. దేవాలయాన్ని ఆనుకుని ఉన్న రోడ్డు విస్తరణలో భాగంగా కుసుమ హరనాథ దేవాలయం దెబ్బతినే పరిస్థితులుంటంతో ప్రత్యామ్నాయ మార్గాలను మంత్రి సురేఖ సూచించారు. దీని చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం అందించాలన్నారు. రాముడు దక్షిణ భారతదేశంలో తిరుగాడిన ప్రాంతాల వివరాలను వివరిస్తూ డిజిటల్ మ్యూజియం ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించగా మంత్రి సురేఖ ఆమోదం తెలిపారు. ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు నిమిత్తం మంత్రి సీతక్కతో చర్చిస్తానని అన్నారు.  అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆకర్షణీయమైన లైటింగ్, ఫౌంటెన్స్ ఏర్పాటు చేసేలా  చర్యలు చేపట్టాలని సూచించారు.

*పర్యాటకశాఖ, దేవాదాయ శాఖ సంయుక్తంగా మూడు సర్క్యూట్లలో విఐపి దర్శన సదుపాయం*

సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు పర్యాటకశాఖ, దేవాదయ శాఖ సంయుక్తంగా మూడు సర్క్యూట్లలో భక్తులకు  విఐపి దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతమైతే మరిన్ని రూట్లలో ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని తెలిపారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కొమురవెల్లి ఒక సర్క్యూట్ గా, మన్యంకొండ, శ్రీరంగపూర్, జోగులాంబ దేవాలయం, అమ్మపల్లి దేవాలయం ఒక సర్కూట్ గా, డిచ్ పల్లి దేవాలయం, బాసర, కామారెడ్డిలో ప్రముఖ దేవాలయాలు ఒక సర్క్యూట్ గా భక్తులకు విఐపి దర్శన సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే భక్తులకు సంబంధిత దేవాలయ మొమెంటో అందించి, శాలువాతో సత్కరించనున్నట్లు అధికారులు మంత్రికి స్పష్టం చేశారు. గైడ్, వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ లు విఐపి భక్తులకు సేవలందించనున్నట్లు కమిషనర్ హన్మంతరావు మంత్రి సురేఖకు వివరించారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments