*మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడి సోదాలు..?*
హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో నేడు ఈడి సోదాలు జరుపు తున్నాయి.
ఈ రోజు ఉదయం నుంచి ఏక కాలంలో 16 ఈడి బృందాలు తనిఖీ చేస్తున్నాయి..
మొత్తం 15 చోట్ల ఏక కాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 15 ప్రాంతాల్లో శ్రీనివాస రెడ్డికి చెందిన ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఖమ్మం లోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. సీఆర్పీఎఫ్, పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నట్టు సమాచారం..