*‘’యూట్యూబ్ ఛానల్స్ – అక్రెడిటేషన్లు‘’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం..*
తెలంగాణ రాష్ట్రం లోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి విధి విధానాలు, అనుసరించాల్సిన నియమ నిబంధనలు సూచించడానికి, యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు, తదితర అంశాలపై చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
‘’యూట్యూబ్ ఛానల్స్- అక్రెడిటేషన్లు’’ అంశంపై మీడియా అకాడమీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సెప్టెంబర్ 23న, హైదరాబాద్, బేగంపేట లోని టూరిజం ప్లాజా హోటల్ లో నిర్వహిస్తుంది. ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, నిష్ణాతులు ఈ సమావేశంలో పాల్గొని సంబంధిత విషయాలపై చర్చించి, జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి సూచనలు చేస్తారని అకాడమీ చైర్మన్ చెప్పారు..