Sunday, December 8, 2024
HomeUncategorized*విజయవాడ మునక వెనుక బుడమేరు వాగు పాత్ర ఎంత? విజయవాడ దుస్థితికి అసలు కారణమేంటి?*వర్షం, వరద...

*విజయవాడ మునక వెనుక బుడమేరు వాగు పాత్ర ఎంత? విజయవాడ దుస్థితికి అసలు కారణమేంటి?*

వర్షం, వరద తరువాత విజయవాడ పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం. కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగనటువంటి కష్టం.. నష్టం.

కొండచరియలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన.. మనసులను కలచివేస్తుంది. ప్రకృతి బీభత్సానికి, వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం. అసలు విజయవాడ నగరానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది?

భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వణికింది? వరద విలయంతో ఎందుకు బిక్కుబిక్కుమంటోంది? బుడమేరు వాగే కొంపముంచిందా? ఎందుకంటే.

ఇటు బుడమేరు, అటు కృష్ణా నది.. మధ్యలో బెజవాడ నగరం. దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లు.

ఈమధ్యకాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవి నగర్.. ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. భారీవర్షాలు, ఆపై వరదలు..

దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గంటలకొద్దీ పవర్ కట్ తో సెల్ ఫోన్ టవర్లు కూడా పని చేయలేదు. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి.

Previous article
*డెబిట్ కార్డ్స్ లేకుండా ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు*

బ్యాంకు డిపాజిట్ మెషిన్స్ లో డబ్బులు డిపాజిట్ చేయాలంటే డెబిట్ కార్డు వాడాల్సిందే. సొంత బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసుకోవాలంటే కనుక డెబిట్ కార్డు ఉండాలి. దీని వల్ల ఖాతా వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అదే డెబిట్ కార్డు వాడకపోతే కనుక ఖాతా నెంబర్, ఫోన్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది నగదు డిపాజిట్ చేయడానికి వచ్చేటప్పుడు డెబిట్ కార్డు మర్చిపోతూ ఉంటారు. కొంతమందికి డెబిట్ కార్డు లేకుండా నగదు డిపాజిట్ చేయలేమా అని అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే ఆర్బీఐ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఏటీఎంలలో డెబిట్ కార్డ్స్ అవసరం లేకుండా యూపీఐ ద్వారా డబ్బు డిపాజిట్ చేసేందుకు కస్టమర్స్ కి అనుమతి కల్పించేలా కొత్త ఫీచర్ ని ప్రారంభించింది.

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ 2024లో భాగంగా యూపీఐ ఇంటరాపరబుల్ క్యాష్ డిపాజిట్ (యూపీఐ-ఐసీడీ) సర్వీసుని డిప్యూటీ గవర్నర్ టి రవి శంకర్ ఆవిష్కరించారు. ఈ ఫీచర్ తో కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాకు లేదా వేరే బ్యాంకు ఖాతాలకు డెబిట్ కార్డ్సు లేకున్నా యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు. మొబైల్ నంబర్ తో లింక్ అయి ఉన్న యూపీఐ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ) లేదా బ్యాంకు ఐఎఫ్ఎస్సీ ద్వారా ఖాతాదారులు క్యాష్ డిపాజిట్ చేయవచ్చు. ఈ సర్వీసుని కస్టమర్లు వినియోగించుకోవాలంటే కనుక క్యాష్ ఏటీఎం మెషిన్ లో యూపీఐ-లింక్డ్ మొబైల్ నంబర్ ఆప్షన్ ని గానీ.. వర్చువల్ పేమెంట్ అడ్రస్ ఆప్షన్ ని గానీ ఎంచుకోవాలి. ఆ తర్వాత మెషిన్ లోని డిపాజిట్ స్లాట్ లో డబ్బులు ఉంచాలి.

మీరు నమోదు చేసిన యూపీఐ-లింక్డ్ మొబైల్ నంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ కి చెందిన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అయితే ఈ యూపీఐ-ఐసీడీ ఫీచర్ కేవలం కొన్ని ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉంది. క్యాష్ రీసైక్లర్ టెక్నాలజీతో డిపాజిట్లను, విత్ డ్రాలను రెండిటినీ హ్యాండిల్ చేయగలిగే ఏటీఎంలలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. బ్యాంకులు క్రమంగా తమ ఏటీఎం నెట్వర్క్స్ లో ఈ ఫీచర్ ని తీసుకురానున్నాయి. ఈ కొత్త ఫీచర్ వల్ల డెబిట్ కార్డులను ప్రత్యేకించి వాడాల్సిన పని ఉండదు. దీని వల్ల కార్డు స్కాములు కూడా తగ్గుతాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఏటీఎం స్లాట్స్ లో ఫేక్ డెబిట్ కార్డు రీడర్ ని ఇన్స్టాల్ చేసి ఖాతాదారుల సొమ్ము కాజేస్తున్నారు. ఇప్పుడు ఈ డెబిట్ కార్డ్ లెస్ ఫీచర్ తో ఇటువంటి స్కాములకు చెక్ పడనుంది.
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments