ఆస్ట్రేలియా లోని సిడ్నీ లో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ (CPC) లో పాల్గొనడానికి రేపటి నుండి అధికారిక విదేశీ పర్యటనకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బృందం.
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు మరియు లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యుల బృందం రేపు రాత్రి (నవంబర్ 2, 2024) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సిడ్నీ కి బయలుదేరుతారు.
CPC అనంతరం స్టడీ టూర్ లో భాగంగా న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా దేశాలలో పర్యటిస్తారు.
అనంతరం నవంబర్ 16, 2024 న పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వస్తారు.