Saturday, December 14, 2024
HomeUncategorizedవిద్యా, వైద్యం , పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి .జిల్లా కలెక్టర్ ఆద్వైత్ కుమార్ సింగ్.

విద్యా, వైద్యం , పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి .జిల్లా కలెక్టర్ ఆద్వైత్ కుమార్ సింగ్.

*జిల్లాలో నీ మహబూబాబాద్, చిన గూడూరు, మరిపెడ మండలాల లో ఆకస్మిక పర్యటన.



*విద్యా, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు*

*జిల్లాలో విద్యా, వైద్యం, పరిశుభ్రత, పరిరక్షణ ప్రత్యేక చర్యలు*

*జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్*


మహబూబాబాద్  సెప్టెంబర్ 20 ( సమయం న్యూస్) *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* జిల్లాలోని మహబూబాబాద్ మండలం, పర్వతగిరి హై స్కూల్, చిన్నగూడూరు మండల కేంద్రంలోని కస్తూరిబా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ హైస్కూల్, అంగన్వాడి కేంద్రం, చిన్నగూడూరు -ఉగ్గంపల్లి మధ్యలో ఉన్న ఆకేర్ వాగు, మరిపేడ మండల కేంద్రంలోని కస్తూరిబా వసతి గృహం , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,  గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధనలు అందించాలని, మెనూ ప్రకారం భోజనం వసతి కల్పించాలని, మరుగుదొడ్లు పరిశుభ్రత పాటించాలని, విద్యుత్ నిరంతరం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, కాంపౌండ్ వాల్స్ సరిచూసుకోవాలని,  వసతి గృహాలలో డైనింగ్ హాల్స్, కిచెన్, స్టడీ రూమ్, శుభ్రత పాటించాలని, క్రమం తప్పకుండా షెడ్యూలు ప్రకారం పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థిని విద్యార్థుల యొక్క హెల్త్ ప్రొఫైల్ పరీక్షిస్తూ ఉండాలని సంబంధిత ప్రిన్సిపల్స్,వార్డెన్లను ఆదేశించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్స్, ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఫీవర్ ఇంటింటి సర్వే నిర్వహించి, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, తదితర వైరల్ ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని,ఇన్ పేషెంట్ లకు వైద్య సేవలు అందించాలని, తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య పరీక్షలు నిర్వహించాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.

పౌష్టిక ఆహారం లోపం కలిగిన సామ్ పిల్లలకి బాలామృతం పౌష్టిక ఆహార పదార్థాలు అందించి మ్యామ్ లోకి తీసుకురావడానికి వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్ సిబ్బంది షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

గ్రామాలు, మున్సిపల్ పరిధిలలో శానిటేషన్, ఫాకింగ్, తడి చెత్త , పొడి చెత్త  వేరు చేసి సెగ్రిగేషన్ చేయాలని, సీజనల్ వ్యాధులు రాకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

సానిటేషన్ నిర్వహణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ, వసతి గృహాల తనిఖీలు, తదితర కార్యక్రమాలపై ప్రత్యేక అధికారులను నియమించి జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుటకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తొర్రూరు ఆర్డీవో నరసింహారావు, చిన్న గూడూరు, తహసిల్దార్ మహబూబ్ అలీ, ఎంపీడీవో రామారావు, మరిపెడ తహసిల్దార్ సైదులు, మరిపెడ మున్సిపల్ కమిషనర్ జి. వెంకటస్వామి, కెజీవిభి ప్రిన్సిపల్ మాధవి, హరి సింగ్ రాథోడ్, మెడికల్ ఆఫీసర్ రవి నాయక్, సంబంధిత అధికారులు ఉన్నారు.

——————————————————–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments