Tuesday, December 10, 2024
HomeUncategorized*సర్వమతాల సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి దర్గా ....* *మత సామరస్యానికి ప్రతీక...

*సర్వమతాల సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి దర్గా ….*
*మత సామరస్యానికి ప్రతీక వైషమ్యాలకు చరమగీతిక…* *మానవత్వమే మతం..గా.* హాజ్రత్ సయ్యద్ ఇంకుషావళి దర్గా.

జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహ్మతుల్లాహు అలై దర్గా  వందల ఏళ్ళ నుండి కులమతాలకతీతంగా సర్వమతాలకు వేదికగా కుల, మత, వర్గ, సామాజిక వైషమ్యాలకు  అతీతంగా భక్తులు దర్షిచించు కుంటారు వేలాది మంది భక్తులు హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి దర్గాను దర్శించుకుంటారు. తమ కష్టాలు తొలగిపోవాలని కోరికలు నెరవేరాలని వేడుకుంటారు. వివిధ జిల్లాల నుండే కాక, మహారాష్ట్రా, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భక్తులు దర్శించుకుంటారు.
*దర్గా ప్రాశస్త్యం:-*
తెలంగాణాలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం బిజిగిరిషరీఫ్ దర్గాను 11వ శతాబ్దంలో నిర్మించినారు. సుమారు 864 సం॥రాల సుదీర్ఘ చరిత్ర ఉన్న దర్గాలో హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహుఆలైతో పాటు ఆయన సోదరుడైన హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావలీ వీరి కుమారులైన హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావళి, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి  బాబా భార్య తగు హజరత్  సయ్యద  అమీనా బీబీ రహమ తుల్లా అలైహి , వారి అత్తమ్మ  యగు  హజరత్  సయ్యద అఫ్జల్ బి బి ( ర.ఆ)  సమాధులున్నాయి. జమ్మికుంట పట్టణానికి తొమ్మిది కిలోమీటర్లు దూరంలో విశాలమైన గుట్టలు, ప్రకృతి రమణీయత ఆహ్లాదకరమైన వాతావరణానికి అనుసంధానమై చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం గల ఈ దర్గా కలదు
ఇస్లాంతో పాటు అల్లాహ్ సందేశాన్ని దివ్య ఖురాన్ లోనీ సూక్తులను ప్రజలకు తెలియజేస్తు మధ్యయుగాల కాలంలో అరబ్బు దేశం నుండి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మానవత్వమే మతం అని విశ్వమానవ
సమాసత్వాన్ని చాటుతు బిజిగిర్ షరీఫ్ చేరుకొని దర్గాను నిర్మించుకున్న హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి తన జీవిత కాలంలో ప్రదర్శించిన మహిమలు, బాధితుల పట్ల చూపిన కరుణ దయ వల్ల ఎందరో ప్రజలు సుఖ శాంతులలో జీవనం గడుపగలినారు. హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా జిల్ హజ్ మాసంలో 10వ తేది: మూడు  రోజుల
పాటు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. నిష్టలతో వేడుకునే భక్తుల కోరికలను హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి
తీర్చుతారనీ ప్రసిద్ధి
*భక్తుల నమ్మకం-*
ప్రజల భక్తి విశ్వాసాలకు చారిత్రాక చిహ్నంగా నిలిచిన ఈ దర్గా పై భక్తులకు ఎనలేని విశ్వాసం ఉంది. దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలకు హిందు, ముస్లిం, సిక్కు తదితర అన్ని మతాల భక్తులు హాజరవుతుంటారు. దర్గాషరీఫ్ మన దేశంలోని మత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోంది. అనేక రుగ్మతలు దీర్ఘకాలిక రోగాలు, మానసిక రోగాలు నయం కావాలని ఇక్కడ వేడుకుంటారు.  దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించి ఉత్సవాలలో పాల్గొంటారు.

Previous article
Next article


*తీవ్రంగా నష్టపోయాం… పెద్దమనసుతో సాయం అందించి ఆదుకోండి*

*చరిత్రలో కనీవినీ ఎరుగని వరద వచ్చింది… అప్రమత్తతతో ప్రాణ నష్టాన్ని నివారించ గలిగాం*

*కేంద్రమంత్రి చౌహాన్ కు మంత్రి నారా లోకేష్ విన్నపం*

అమరావతి: చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణానది వరద నష్టం వివరాలను మంత్రి లోకేష్ కేంద్ర మంత్రికి నివేదిస్తూ… తీవ్రంగా నష్టపోయిన తమ ప్రజలు తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు పెద్దమనసుతో సాయం అందించాలని కోరారు. వరద సమయంలో ముఖ్యమంత్రి అప్రమత్తతతో వ్యవహరించి ప్రాణనష్టాన్ని నివారించ గలిగారని తెలిపారు. వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి నారా లోకేష్ గురువారం మధ్యాహ్నం స్వాగతం పలికారు. తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా  పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని మంత్రి లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని  హెలీప్యాడ్ వద్ద లాండ్ అయి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వరద వల్ల దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు. గేట్ల మరమ్మత్తుల పనుల వివరాలను లోకేష్ కేంద్ర మంత్రికి తెలియజేసారు. తర్వాత జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగర్, అంబాపురం, విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి చౌహాన్, మంత్రి లోకేష్ తో కలిసి ఎన్డీఆర్ఎఫ్ బోటుపై తిరుగుతూ పరిశీలించారు. భారీవరద కారణంగా బుడమేరుకు పడిన గండ్లు పూడ్చేందుకు రేయింబవళ్ళు శ్రమిస్తున్నామని లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చౌహాన్ స్పందిస్తూ… వరద కారణంగా జరిగిన నష్టాన్ని త్వరితగతిన భర్తీ చేసేందుకు సాయం అందిస్తామని చెప్పారు. వరద బాధిత ప్రజలను సాదారణ స్థితికి తెచ్చేందుకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి చౌహాన్ పర్యటనలో లోకేష్ తో పాటు మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన అనంతరం విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో వరద నష్టం వివరాలను  కేంద్ర మంత్రి చౌహాన్ కు ముఖ్యమంత్రి వివరించారు. తర్వాత వరదనష్టంపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి చౌహాన్ సమీక్షించారు. జరిగిన నష్టాన్ని కేంద్రమంత్రికి వివరించిన అధికారులు… నష్టంపై నివేదికలు అందజేశారు.
******
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments