Monday, January 20, 2025
HomeUncategorizedసివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన  అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం-  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క:-సింగరేణిని...


సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన  అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం-  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క:-సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం- సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం


సివిల్స్ మెయిన్స్ కు అయిన అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్ పాయింట్స్
——————-
సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం

సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణం.. ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో వసతి కల్పిస్తాం

గత పాలకులు సింగరేణిని వ్యక్తిగత, రాజకీయ అవసరాలకు వాడుకున్నారు… మేము సింగరేణిని ప్రపంచంలోనే నేటి సంస్థగా నిలబెట్టాలనుకుంటున్నాం

కార్మికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబానికి కోటి రూపాయలకు పైగా ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నాం

సింగరేణిలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్, పంపు స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తాం

ప్రపంచవ్యాప్తంగా అంతా కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ పవర్ వైపు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బొగ్గుపై ఆధారపడే పరిస్థితి తగ్గి ఆ గనులు మూతపడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుచూపుతో సింగరేణిని మైనింగ్ రంగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
  ఏ రాష్ట్రంలో లేని విధంగా గనుల తవ్వకంలో వందేళ్ల అనుభవం సింగరేణికి ఉంది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా లిథియం, గ్రాఫైట్ వంటి గనుల తవ్వకాల వైపు సింగరేణిని తీర్చిదిద్దుతున్నాం. ఇందుకుగాను దేశవ్యాప్తంగా నిపుణులను ఆహ్వానించి వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సివిల్స్ వైపు రాష్ట్ర యువతను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి పక్షాన ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి దశలోనూ ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. అంది వచ్చిన అవకాశాన్ని తెలంగాణ యువత అందిపుచ్చుకోవాలి

ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది సివిల్స్ తుది పరీక్షలో విజయం సాధిస్తే రాష్ట్రానికి కావాల్సింది అంతకన్నా ఏమీ లేదు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఢిల్లీలో వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తాం.

   గత పాలకులు సింగరేణిని వారి వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. మేము ఈ సంస్థను కాపాడి ప్రసిద్ధ సంస్థగా నిలబెట్టాలని మా ఆలోచన.. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా బలమైన సంస్థ.

   కార్మిక సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. కార్మికులు ఇది మా సంస్థ అని  భావిస్తే మంచి ఫలితాలు సాధిస్తాం. వారి ప్రయోజనాలే మాకు మొదటి ప్రాధాన్యత. సింగరేణి ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి పిల్లల సంక్షేమాన్ని మా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుంది.
   సింగరేణి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 కోట్లకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నాం

  సింగరేణి ప్రాంతంలో గనులు తవ్వి వదిలివేసిన ప్రాంతాలు, ఖాళీగా ఉన్న స్థలాల్లో సోలార్, పంపుడు స్టోరేజ్ వంటి పద్ధతుల్లో  
గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తాం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments