Saturday, December 14, 2024
HomeUncategorized*సెప్టెంబర్ 05:-అర్ధరాత్రి వేళ కాజీపేట పరిసరాల్లో సిపి ఆకస్మిక తనిఖీ*వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్...

*సెప్టెంబర్ 05:-అర్ధరాత్రి వేళ కాజీపేట పరిసరాల్లో సిపి ఆకస్మిక తనిఖీ*

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం అర్థరాత్రి కాజీపేటలోని విష్ణుపురి, సోమిడి, రైల్వే స్టేషన్ల ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించారు. ప్రధానంగా శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ముందస్తూ చర్యల్లో భాగంగా  స్థానిక పోలీసులు చేపడుతున్న పోలీస్ పెట్రోలింగ్ తీరుతేన్నులతో పాటు, ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పాటిస్తున్న సమయపాలనపై పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

Previous article
Next article
సమాజ ప్రగతిలో  ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం
– వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండ: సమాజ  ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని వరంగల్  ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.

గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్  లోని కాన్ఫరెన్స్ హాలులో  హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో  గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని  నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఎంపీ  కడియం కావ్య, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె. ఆర్. నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య  జ్యోతి ప్రజ్వలన చేసి  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్  చిత్రపటానికి పూలమాలలు వేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ  తాము చదువు చెప్పిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటే గురువులు ఎంతో సంతోషపడతారని  పేర్కొన్నారు. ప్రతి విజేత కూడా  తన విజయానికి కారణం గురువులే అని చెబుతుంటారని అన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను  గుర్తించేది ఉపాధ్యాయులేనని తెలిపారు. విద్యార్థులలో దాగి ఉన్న   ప్రతిభను మరింత మెరుగు పరిచే విధంగా గురువులు తోడ్పాటునందించి ఉన్నత స్థాయికి చేరడంలో కృషి చేస్తారన్నారు. కరోనా సమయంలో పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. విద్యార్థులను సమగ్ర మూర్తిమత్వంతో గురువులు తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా  అవార్డులు అందుకున్నవారికి అభినందనలు తెలియజేశారు. 

*వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి* మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది  ఉపాధ్యాయులేనని  అన్నారు.  విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేది గురువులేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఉపాధ్యాయుల సహకారం కూడా ఎంత ఉందన్నారు. రాబోయే రోజులలో కొత్త వరంగల్ ను చూడబోతున్నారని తెలిపారు.  కొత్త వరంగల్ ను చూడడంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉండాలన్నారు. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించుకున్నామని పేర్కొన్నారు.  గురుపూజోత్సవం సందర్భంగా  సభాధ్యక్షత వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.

*పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి* మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే అది ఉపాధ్యాయులతోనే సాధ్యమని పేర్కొన్నారు. సమాజంలోని వివిధ వర్గాలు ఉపాధ్యాయుల పైన ఎంతో నమ్మకం కలిగి ఉంటారని తెలిపారు. ఉపాధ్యాయులు చేసే సేవలను కొలువలేమని , సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉందన్నారు. గురువులు అందించిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో మీ ముందున్నానని  చెప్పారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
*వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు* మాట్లాడుతూ ఈ స్థాయిలో ఉండడానికి  తన గురువులే కారణమని  తెలిపారు. తాను డాక్టర్ అవుదామని  అనుకున్నానని, కానీ కాలేకపోయానని   చెప్పారు. తన గురువు కొమురయ్య  జాతీయస్థాయి లో క్రీడాకారునిగా రాణించేలా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. సమాజంలో ఎవరి నుంచి ఏమీ ఆశించని ఉద్యోగం  ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమేనని అన్నారు. అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించే వారే గురువులని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు.

ఈ సందర్భంగా  *హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య* మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులు అందించే విద్యనే అన్ని రంగాల్లో రాణించేలా తోడ్పడుతుందని  అన్నారు. విద్యార్థులు ఉన్నతంగా  రాణించాలంటే  ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరమని పేర్కొన్నారు . జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందజేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో  ప్రభుత్వ పాఠశాలల్లో  మౌలిక వసతులు సమకూరాయని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో  అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో  ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని, ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ప్రగతి నివేదికను  జిల్లా విద్యాశాఖ అధికారి  వాసంతి వివరించారు.

ఉత్తమ పనితీరుతో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 31మంది ఉపాధ్యాయులను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య  శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందించి అభినందనలు తెలియజేశారు.

హనుమకొండ లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ పాఠశాల విద్యార్థులు చేసిన స్వాగతం నృత్యం, పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్  ఏనుగుల మానస, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments