![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2024/12/img-20241229-wa05303903982453467044665.jpg?resize=696%2C464&ssl=1)
![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2024/12/img-20241229-wa05322123680880960131358.jpg?resize=696%2C464&ssl=1)
ఆదివారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామం లోని కన్హ శాంతి వనంను సందర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కన్హ శాంతి వనంలో galibuda (scientific name: Hildegardia populifolia)మొక్కను నాటారు. అనంతరం ముఖ్యమంత్రి కన్హ శాంతి వనం ను సందర్శించారు.
అక్కడ పెంచుతున్న మొక్కలు, చెట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్శనలో ముఖ్యమంత్రి వెంట చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య, షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, హెల్త్ సెంటర్ గ్లోబల్ గైడ్ దేవర్డ్ దార్జి, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, తదితరులు పాల్గొన్నారు.
—————-