Saturday, December 14, 2024
HomeUncategorizedProphet for the world.(ప్రొఫెట్ ఫర్ ది వరల్డ్)పుస్తకాన్ని ఆవిష్కరించిన సి ఎం రేవంత్ రెడ్డి

Prophet for the world.(ప్రొఫెట్ ఫర్ ది వరల్డ్)పుస్తకాన్ని ఆవిష్కరించిన సి ఎం రేవంత్ రెడ్డి

*”Prophet for the World” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి  ప్రసంగం.
హైదరాబాద్ సెప్టెంబర్14( సమయం న్యూస్)
ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించింది.

గీత, బైబిల్, ఖురాన్ సారాంశం  ప్రపంచ శాంతి మాత్రమే…

కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయి…

ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మన ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణం …

గతంలో హైదరాబాద్ లో ఒక వైపు ఓవైసీ, మరో వైపు నేను ఎంపీగా ఉన్నాం… 

అసదుద్దీన్ ఓవైసీ కొన్ని సార్లు కాంగ్రెస్ పై కూడా విమర్శలు చేసేవారు…

మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే మంచి ప్రతిపక్షం కూడా ఉండాలి.. 

పార్లమెంట్ లో పేదల తరపున మాట్లాడే నేతలు తగ్గిపోయారు… 

కార్పొరేట్ రంగంలో, వ్యాపారాల్లో మన వాళ్లు అగ్రగామిగా ఎదుగుతున్నారు..

పేదల తరుపున మాట్లాడే నాయకులు క్రమంగా తగ్గిపోతున్నారు…

పార్లమెంట్ లో పేదల కోసం మాట్లాడే వారిలో అసదుద్దీన్ ఓవైసీ ఒకరు..

ఎన్నికల ముగిసే వరకే రాజకీయాలు.. ఆ తరువాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం అంతా కలిసి పనిచేయాలి…

మజ్లిస్ పార్టీ నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నాం…

అనేక ఏళ్ల నుంచి మూసీ నది మురికి కూపంలా మారింది..

మూసీ ప్రక్షాళన కోసం మజ్లిస్ సహకారం తీసుకుంటున్నాం…

పేదలకు  డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవ్వనున్నాం…

దేశాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిది..

ఒక మంచి మార్గంలో మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది…

కలిసిమెలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతాం..

చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు ప్రభుత్వాలను రెండు సార్లు గెలిపించారు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రెండోసారి అవకాశం వస్తుందని నమ్ముతున్న..

ఈ పదేళ్ల పాటు పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments