Saturday, December 14, 2024
HomeUncategorizedపర్పెక్ట్ లీడర్ల తో టి పిసి టీమ్

పర్పెక్ట్ లీడర్ల తో టి పిసి టీమ్

డీసీసీ అధ్యక్షుల భర్తీ పైన కసరత్తు.

పర్ఫెక్ట్ లీడర్లతో ‘టీపీసీసీ’ టీమ్!
డీసీసీ అధ్యక్షుల భర్తీపైనా కసరత్తు
ఆదిలాబాద్ పై స్పెషల్ ఫోకస్
-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బి.మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ను ఏఐసీసీ నియమించింది. కొన్ని రోజుల క్రితం బాధ్యతలు సైతం స్వీకరించారు. ఇప్పుడు రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలపై ఆయన దృష్టి సారించినట్లు తెలిసింది. దీంతో పదవిని ఆశిస్తున్న నాయకులు రాష్ట్ర, జాతీయ నేతల ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, ఢిల్లీకి వెళ్లి తమకు తెలిసిన నాయకుల ద్వారా ఫోన్లు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే పార్టీ విజయం కోసం కృషి చేసిన, ప్రస్తుతం పార్టీ కోసం కష్టపడుతున్న లీడర్లకు మాత్రమే పదవులు ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికలు.. సామాజిక సమీకరణాలు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో డీసీసీ అధ్యక్షుడి పోస్ట్ ఉంటే.. తమ అనుచరులకు న్యాయం చేయవచ్చని చాలా మంది లీడర్లు భావిస్తున్నారు. పార్టీలోనూ తమదైన ముద్ర వేయొచ్చని ఆశపడుతున్నారు. దీంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే సామాజిక సమతూకం ఉండేలా కార్యవర్గాలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పలు జిల్లాలకు కొత్త వారికి డీసీసీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఇన్ చార్జి మంత్రుల అభిప్రాయాలను టీపీసీసీ సేకరిస్తున్నట్లు సమాచారం.

ముందుగా రాష్ట్ర కార్యవర్గం..
డీసీసీల నియామకానికి ముందు పూర్తిస్థాయిలో రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తి చేయాలని టీపీసీసీ చీఫ్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే జంబు టీమ్ ఏర్పాటు చేయాలా? పరిమిత సంఖ్యలోనే పోస్టులు క్రియేట్ చేయాలా? అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోనట్లు సమాచారం. అయితే పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం పోటీ పడిన వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా సీనియర్‌ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల పోస్టులు భర్తీ చేసే అవకాశముంది. అంతేకాకుండా తెలంగాణ మహిళా కాంగ్రెస్ చీఫ్ పోస్టును కూడా ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నది.

ఆదిలాబాద్ పై స్పెషల్ ఫోకస్
నిజామాబాద్ జిల్లాకు చెందిన డి. శ్రీనివాస్ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేయగా.. ఆ జిల్లాకు చెందిన నాయకుడైన మహేష్ కుమార్ గౌడ్ కు ఈ సారి పదవి దక్కింది. దీంతో పక్కనే ఉన్న ఆదిలాబాద్ జిల్లాపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీసీసీ అధ్యక్షుడు గా  ఉన్న సాజిద్ ఖాన్ పార్టీకి రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉన్నది. పలువురు ఈ పోస్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా.. రాష్ట్ర నాయకత్వం ఆ పోస్టులను భర్తీ చేయలేదు. అయితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ డీసీసీల భర్తీపై దృష్టి సారించడం తో ఆదిలాబాద్ జిల్లాకు సైతం డీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారు. ఈ పోస్టు కోసం ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తోపాటు బజార్ హాత్నూర్ జెడ్ పి టీ సీ మల్లెపూలా నరసయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు సమాచారం. అయితే హెచ్1బీ వీసా స్కామ్ లో కంది శ్రీనివాస్ రెడ్డి పేరు బయటకు రావడంతో, రాహుల్ గాంధీ తో ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఫోటో ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి వళ్ల పార్టీ  పరువు పోయినట్టు అయిందని పార్టీ వర్గాలు భావించి అధిష్టానం శ్రీకాంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఆయన పార్టీ పటిష్టత కోసం రెగ్యులర్ గా కార్యక్రమాలు చేస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఆయనకు ఆ పోస్టు అప్పగించేందుకు దాదాపుగా నిర్ణయించినట్లు గాంధీభవన్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తున్నది.  అయితే రాష్ట్ర కమిటీలు సర్వే చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే నియామకాలు ఉంటాయని అధిష్ఠానం స్పష్టం చేయడంతో పదవి ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తి నెలకొన్నది.__

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments