HomeUncategorizedవిశాఖ సెప్టెంబర్07 (సమయం న్యూస్)*బొగ్గు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి హై కోర్టు ఉత్తర్వు...
విశాఖ సెప్టెంబర్07 (సమయం న్యూస్)
*బొగ్గు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి హై కోర్టు ఉత్తర్వు తో కొంత ఊరట లభించింది*.
పోర్టుల్లో ఉన్న బొగ్గును విశాఖ ఉక్కుకు ఇచ్చేయాలంటూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో బొగ్గు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.
విశాఖ పోర్టు ట్రస్టు ఆధీనంలో ఉన్న 92 వేల టన్నులు దిగుమతి చేసుకున్న బొగ్గు (ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్) అందుబాటులోకి వచ్చింది.
దాన్నుంచి శుక్రవారం ఒక రేక్ హార్డ్ కోకింగ్ కోల్, ఒక రేక్ సాఫ్ట్ కోకింగ్ కోల్ తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అదే విధంగా ట్రక్‌ల ద్వారానూ తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
అదానీ గంగవరం పోర్టులో అందుబాటులో ఉన్న బొగ్గును వారితో సయోధ్య కుదిరిన తర్వాత కన్వేయర్ ద్వారా శనివారం బి షిప్టు నాటికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.